The woman who tried to commit suicide failed
mictv telugu

 సూసైడ్ కోసం సెల్ టవర్ ఎక్కి కిందకి దిగిన మహిళ.. పైన ఏం జరిగిందంటే

May 10, 2022

సూసైడ్ కోసం సెల్ టవర్ ఎక్కి కిందకి దిగిన మహిళ.. పైన ఏం జరిగిందంటే

ఓ మహిళ కుటుంబ కారణాలతో ఆత్మహత్య చేసుకుందామని సెల్ టవర్ ఎక్కింది. పోలీసులు, బంధువులు, స్థానికులు ఎంత బతిమిలాడినా ఆమె కిందకు రావడానికి ఒప్పుకోలేదు. ఇంకా పైపైకి వెళ్లగా, అక్కడ కనపడిన దృష్యాన్ని చూసి తనే స్వయంగా కిందకు దిగి వచ్చింది. కేరళలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత మహిళకు భర్తతో ఘర్షణ జరుగగా, బిడ్డను తండ్రి ఆమె వద్దనుంచి లాక్కున్నాడు. దాంతో మనస్థాపానికి గురైన మహిళ తన బిడ్డను అప్పగించాలని, లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని సెల్ టవర్ ఎక్కి బెదిరించింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వగా, వారు వచ్చి తగిన న్యాయం చేస్తామని బతిమిలాడినా మహిళ కిందకు దిగలేదు. ఇంకా పై నుంచి దూకుదామని పైపైకి ఎక్కగా, ఈ క్రమంలో అక్కడ ఉన్న తేనె తుట్టెను అనుకోకుండా మహిళ తాకింది.

దీంతో తేనెటీగలు మహిళను చుట్టుముట్టి వెంటబడడంతో బిగ్గరగా ఏడుస్తూ కిందకు దిగడం ప్రారంభించింది. కొన్ని తేనెటీగలు కుట్టడంతో ఖంగారులో కొన్ని అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేసింది. అప్పటికే అక్కడు ఉన్న పోలీసు, ఫైర్ సిబ్బంది వల వేసి రెడీగా ఉండడంతో మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, ఆమె భర్త ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. మహిళను సంప్రదించాలనుకునే వారికోసం పోలీసులు ప్రత్యేక నెంబరును ప్రకటించారు. అయితే మహిళ తమిళనాడు నుంచి బ్రతుకుతెరువు కోసం కేరళకు వచ్చిందని పోలీసులు గుర్తించారు.