‘ఆలయాలకు వెళ్లే మహిళలు అంగాంగ ప్రదర్శన చెయ్యటానికే వెళ్తారు. భక్తి, తొక్కాతోలు ఏమీ వుండదు. పురుషులను ఆకట్టుకోవడానికే వెళ్తున్నారు. కోనేరులో తడిసిన బట్టలతో వచ్చిన ఆడవాళ్ళను చూడటానికే మగ భక్తులు గుళ్ళకు వెళ్తున్నారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేరళ సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి. ఆమె చేసిన వ్యఖ్యలపై తీవ్ర దూమారం చెలరేగుతోంది. ఒక మహిళా నాయకురాలు అయివుండి ఇంతలా దిగజారినట్టు మాట్లాడుతారా అనే విమర్శలు గుప్పుమంటున్నాయి.శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తిరుగుబాటుకు బీజేపీ, ఆరెస్సెస్, కాంగ్రెస్‌లు కుట్ర పన్నుతున్నాయని శ్రీమతి ఆరోపించారు. ‘కేరళలోని అనేక సామాజిక దురాచారాలను కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే రూపుమాపింది. సుప్రీం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సమానత్వ హక్కును ఎవరూ కాదనలేరు’ అని వ్యాఖ్యానించారు.
ఎంపీ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను ఇంత నీచంగా అవమానిస్తారా అని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వెంటనే తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.