ఇచ్చిన మాట తప్పను.. నిలబెట్టుకుంటా: మంచు విష్ణు - MicTv.in - Telugu News
mictv telugu

ఇచ్చిన మాట తప్పను.. నిలబెట్టుకుంటా: మంచు విష్ణు

May 15, 2022

టాలీవుడ్ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, వారి సంపూర్ణ ఆరోగ్యమే తన ప్రధాన కర్తవ్యమని, ‘మా’ ఎన్నికల సమయంలో తను ఇచ్చిన మాటను తప్పనని, ఆరు నెలల్లో చేసి చూపిస్తానని అన్నారు. అసోసియేషన్‌కు సంబంధించి మంచు విష్ణు పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.

విష్ణు మాట్లాడుతూ.. ”మరో ఆరు నెలల్లో ‘మా’ శాశ్వత భవనానికి భూమి పూజా చేస్తాం. ఎన్నికల సమయంలో మాటిచ్చాను అసోసియేషన్‌కు శాశ్వత భవనం కటిస్తా అని. మరో ఆరు నెలల్లో భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తాం. ‘మా’ సభ్యుల సంక్షేమం, వారి సంపూర్ణ ఆరోగ్యమే నా ప్రధాన కర్తవ్యం. అందుకోసం నా కమిటీతో కలిసి తగిన ప్రణాళికలు రచించాం. ఇక, సినిమా టికెట్ ధరల విషయంలో నేను మాట్లాడలేదని అందరూ విమర్శించారు. కావాలనే నేను సైలెంట్‌గా ఉన్నా. టికెట్ ధరలు పెంచితే కొందరికి, తగ్గిస్తే మరికొందరికి ఇబ్బందులున్నాయి. టికెట్ రేట్లు అనేది చాలా పెద్ద విషయం. దీని గురించి, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది” అని ఆయన అన్నారు.