ఇచ్చిన మాట తప్పను.. నిలబెట్టుకుంటా: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇచ్చిన మాట తప్పను.. నిలబెట్టుకుంటా: జగన్

March 4, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని దేవీప‌ట్నం మండ‌లం ఇందుకూరు-1లో శుక్రవారం కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ సీఎం జగన్‌తో కలిసి పర్యటించారు. అనంతరం పున‌రావాస కాల‌నీలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. ”నిర్వాసితులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి. కేంద్ర స‌ర్కారు నుంచి సహాయ సహకారాలు తీసుకుని, దీన్ని పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాలి” అని అన్నారు.

అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందని అన్నారు. గ‌తంలో పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్ప‌ష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర సాయంతో పాటు ఏపీ కూడా సాయం చేస్తుందని తెలిపారు. కేంద్రం ఇస్తున్న‌ రూ.6 లక్షలతో పాటు, ఏపీ అదనంగా 3 లక్షలు ఇస్తుందని జగన్ తెలిపారు.

మరోపక్క జలవనరుల శాఖ అధికారులతో జ‌గ‌న్ సమీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ నుంచి తిరిగి బయలుదేరి, సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకొనున్నారు.