ప్రపంచంలోనే పొడవైన కారు.. ప్రత్యేకతలు చూస్తే మతి పోవాల్సిందే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే పొడవైన కారు.. ప్రత్యేకతలు చూస్తే మతి పోవాల్సిందే

March 11, 2022

ngfgn

అతి పొడవైన కారుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ కారు పేరు ‘అమెరికన్ డ్రీమ్స్’. వంద ఫీట్ల పొడవుండే ఈ కారులో స్విమ్మింగ్ పూల్, ఒక మినీ గోల్ఫ్ కోర్టు, బాత్ టబ్, హెలీప్యాడ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఒకేసారి 75 మంది ప్రయాణించగలిగే ఈ కారును రెండు వైపుల నుంచి నడిపించవచ్చు. జే ఓర్‌బెర్గ్‌ అనే వ్యక్తి రూపొందించిన ఈ కారు అనేక హాలీవుడ్ సినిమాలలో కూడా వాడారంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సోషల్ మీడియాలో తెలిపింది. అయితే ఈ కారు రోడ్డు మీదికి రావడం లేదు. కార్లకు సంబంధించిన ఓ మ్యూజియంలో పర్యాటకుల సందర్శనార్ధం దీన్ని ఉంచారు.