భీమ్లా నాయక్‌‌పై కుమ్మరి కులస్థుల ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

భీమ్లా నాయక్‌‌పై కుమ్మరి కులస్థుల ఆగ్రహం

March 1, 2022

pavan

‘భీమ్లా నాయక్’ సినిమాలో తమ మనోభావాలను దెబ్బతిసేలా ఓ సన్నివేశం ఉందంటూ.. ఆంధ్ర‌ప్రదేశ్‌ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ మంగళవారం ఫిర్యాదు చేసింది. అనంతరం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం.పురుషోత్తం మాట్లాడుతూ.. ”భీమ్లా నాయక్‌ సినిమాలో కుమ్మరుల మనోభావాలు దెబ్బతిసేలా ఓ సన్నివేశం ఉంది. దాన్ని వెంటనే తొలగించాలి” అని గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

అంతేకాకుండా సినిమాలో రానా ఓ స‌న్నివేశంలో కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నుతాడు. అనంత‌రం తన ప్రత్యర్థిపై దాడి చేస్తాడు. తాము కుమ్మరి చక్రంను ఎంతో పవిత్రంగా భావిస్తాం. అటువంటి దాన్ని తన్నడం కుమ్మరుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది అని పురుషోత్తం విమర్శించారు. ఈ సన్నివేశం తమను కించపరిచేలా ఉంద‌ని వివ‌రించారు.

మరోపక్క ఫిబ్రవరి 25న విడుదలైనా ఈ సినిమా భారీ కలెక్షలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ అభిమానులు భారీ కటౌట్లు నిర్మించి పాలభిషేకాలు చేస్తున్నారు. ఈ తరుణంలో దర్శకుడు, నిర్మాత, కథానాయకులపై చర్యలు తీసుకోవాల‌ని కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.