The YCP leader occupied the house did not vote for him
mictv telugu

తనకు ఓటు వేయలేదని ఇంటిని ఆక్రమించుకున్న వైసీపీ నేత

July 12, 2022

ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ గ్రామ స్థాయి నేత రెచ్చిపోయారు. సర్పంచ్ స్థానాలకు గతంలో జరిగిన ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని ఇంటిని ఆక్రమించాడు. అంతేకాక, ఆ కంచె వేసి ఇంట్లోకి గొర్రెలను తోలాడు. కనిగిరి మండలం గానుగుపెంటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మర్రి శ్రీను అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బొబ్బూరి పోలయ్య వద్ద 18 ఏళ్ల క్రితం ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. అక్కడే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గత సర్పంచ్ ఎన్నికల్లో పోలయ్య కుమారుడు గురుస్వామి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఈ క్రమంలో తనకు ఓటేయలేదనే కారణంతో శ్రీనుపై కక్ష్య పెంచుకున్న గురుస్వామి గత కొన్ని రోజులుగా మర్రి శ్రీను కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. తాజగా వారి ఇంటికి తాళం వేసి గొర్రెలను ఇంట్లోకి వదిలి కంచె వేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, వారు వచ్చి విచారణ చేపట్టారు.