సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో సాధారణ పౌరులు చేయలేని ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వాటిని చూసి చిన్న పిల్లలు, టీనేజర్స్ అదంతా నిజమేనంటూ భ్రమిస్తారు. ఈ క్రమంలో తమకు ఏ ప్రాబ్లం వచ్చినా తమ హీరో చూసుకుంటాడనే భావన కొంత మంది అమాయకులు ఏర్పరచుకుంటారు. ఇక్కడ ఓ యువతి ఇలాగే చేసింది. ఇంట్లో తనను, అమ్మను డాడీ కొడుతున్నాడని హిందీ హీరో వరుణ్ ధావన్‌కు ఫిర్యాదు చేసింది.
సదరు హీరో పేరు మీద యువతి ఫ్యాన్ అసోసియేషన్ పేరుతో ఓ ఖాతాను సోషల్ మీడియాలో నిర్వహిస్తోంది. దీంతో దాని ద్వారానే తన సమస్యను ఆయనతో చెప్పుకుంది. ‘నా నాన్న రోజూ తాగి వచ్చి అమ్మను, నన్ను బండ బూతులు తిడుతున్నాడు. అక్రమ సంబంధాలు పెట్టుకొని మాకు సరైన తిండి కూడా పెట్టట్లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దయచేసి మీరే ఏదైనా సహాయం చేయండి’ అంటూ హీరోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన వరుణ్ ధావన్ ‘నిజంగా ఇది బాధాకరమైన విషయం. మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంటే మీకు తప్పకుండా సహాయం చేస్తా. మీ ప్రాంత అధికారులతో మాట్లాడుతా’నని బదులిచ్చాడు. దీంతో యువతి హీరోకు ధన్యవాదాలు చెప్పింది.
This an extremely serious matter and if this is true I will help will u and speak to the authorities. https://t.co/IaIOEMFk8u
— VarunKukooDhawan (@Varun_dvn) June 6, 2022