ఫోన్ మాట్లాడుతూ సెల్ చార్జింగ్.. యువకుడి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ మాట్లాడుతూ సెల్ చార్జింగ్.. యువకుడి మృతి

March 30, 2022

phone

ఎలక్ట్రానిక్ వస్తువలను ఎలా వాడాలో, ఎలా వాడకూడదో నిపుణులు హెచ్చరించినా, జరుగుతున్న సంఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యం వీడడం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాదులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని శంకర్ పల్లిలో అస్సాం నుంచి వచ్చిన ఓ యువకుడు ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తన వద్దనున్న సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టాడు. అనంతరం ఫోన్ రావడంతో ఛార్జింగ్ తొలగించకుండా అలానే మాట్లాడాడు. దీంతో కొద్దిసేపటికే అతనికి కరెంటు షాక్ కొట్టింది. దీంతో చెవులు, కాళ్లు కాలిపోయాయి. సమీపంలో ఉన్న స్నేహితులు స్పందించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.