యువతి ఇంటి ముందు పెట్రోల్ పోసుకున్న ప్రేమికుడు.. మ‌ృతి - MicTv.in - Telugu News
mictv telugu

యువతి ఇంటి ముందు పెట్రోల్ పోసుకున్న ప్రేమికుడు.. మ‌ృతి

April 25, 2022

ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అనంతరం మృతి చెందాడు. వివరాలు.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన యువకుడు పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె ఇంటిముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.