The young man who pulled the shark ashore
mictv telugu

షార్క్ చేపనే ఒడ్డుకు లాక్కొచ్చిన యువకుడు.. వీడియో వైరల్

August 17, 2022

సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ కాస్త వింత, సాహసోపేత సంఘటనలు జరిగినా వెంటనే స్మార్ట్ ఫోన్లలో వచ్చేస్తున్నాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో రోజూ లక్షల సంఖ్యలో వైరల్ అవుతుంటాయి. అందులో ఉండే కంటెంట్, ఔత్సాహికులు ప్రదర్శించే ధైర్య సాహసాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ యువకుడు చేసిన సాహసం ఆకట్టుకుంటోంది. వీడియో ప్రకారం.. సరదాగా బీచ్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఓ యువకుడు చేపలు పట్టడం కోసం సముద్రంలో గాలం వేశాడు. అయితే అతను ఊహించనట్టుగా ఆ గాలానికి ప్రమాదకర షార్క్ చేప చిక్కింది. అయినా యువకుడు భయపడకుండా దానిని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. చేప విడిపించుకుందామని ఎంత ప్రయత్నించినా, అంతకు మించి ధైర్యసాహసాలు కలిగిన యువకుడు ఎలాగోలా షార్కును ఒడ్డుకు లాక్కొచ్చాడు. తర్వాత దానిని మళ్లీ సముద్రంలోకి వదిలేశాడు లెండి. కానీ, ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అతడు చేసిన ప్రయత్నం మాత్రం మెచ్చుకోవాల్సిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Only In Mastic (@only_in_mastic)