కష్టాలకు కారణం ఏంటో చెప్పిన యువకుడు..ఫోటోల్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కష్టాలకు కారణం ఏంటో చెప్పిన యువకుడు..ఫోటోల్ వైరల్

May 31, 2022

హైదరాబాద్‌ రోడ్లపై ఓ యువకుడు తన ద్విచక్ర వాహనం వెనక భాగంలో నెంబర్ ప్లేట్ అడుగున ఓ పలకను వేలాడదీసి, దానిపై కష్టాలు ‘ఎందుకు వస్తాయో తెలుసా’ అంటూ రాసిన ఓ సూత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ పలకపై ఉన్న మాటలను చదివిన ప్రతి వాహనదారుడు ‘భలే కొటేషన్ రాశావు భయ్యా’ అంటూ నవ్వుకుంటు వెళ్లిపోతున్నారు.

 

ఆ పలకపై ఓ సుద్ద ముక్కతో పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది..’ఎవరికీ కష్టాలు ఉరికెనే రావు, పెళ్లి చేసుకుంటేనే వస్తాయి’. ఈ వింత నోటీస్‌ని రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దూరం నుండి చూసేవారు మొదటగా అదేదో నోటిస్ బోర్డు అనుకున్నారు. కానీ, తీరా దగ్గరకెళ్లి చూస్తే అసలు విషయాన్ని తెలుసుకొని, తెగ నవ్వుకున్నారు.’ వీడెవడండి బాబు ఇలా రాసిపెట్టుకున్నాడు’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆ సూత్రాని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.