వీడియో : డ్యాం నుంచి జారిపడ్డ యువకుడు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : డ్యాం నుంచి జారిపడ్డ యువకుడు

May 23, 2022

ఓ యువకుడు సరదాగా చేసిన ఫీట్ అతని ప్రాణాల మీదకు రావడంతో పాటు పోలీస్ కేసు నమోదయ్యేలా చేసింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున నీరు ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. తుంగభద్ర డ్యాంలోకి ఒక్కరోజే 32 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చిక్ బళ్లాపూర్‌లో ఉన్న శ్రీనివాస సాగర డ్యాంలోకి భారీగా నీరు వచ్చి చేరగా, డ్యాం నిండిపోయి నీళ్లు పైనుంచి ఓవర్ ఫ్లో అవుతున్నాయి. వేసవి కావడంతో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో 20 ఏళ్ల ఓ యువకుడు సరదాగా ట్రెక్కింగ్ చేయాలన్న కోరికతో డ్యాంపైకి ఎక్కబోయాడు. 50 అడుగులున్న డ్యాంను 25 అడుగుల వరకు ఎక్కాడు. అనంతరం పట్టు జారిపోవడంతో కిందకు జారి పడ్డాడు. అక్కడే ఉన్న మిగిలిన వారు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలిచంగా, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కాగా, ప్రమాదకర ఫీట్ చేసినందుకు గాను పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.