పెళ్లి కాదేమోనన్న బెంగతో యువతి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కాదేమోనన్న బెంగతో యువతి మృతి

May 11, 2022

 

పెళ్లి చేసుకోవడానికి సెట్ చేసుకుంటున్న సంబంధాలను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి చెడగొడుతుండడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనీల (19)ను అదే గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి అమ్మాయికి తొందరగా పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందుకోసం సంబంధాలను మాట్లాడుకున్నారు. అయితే సాయి తాను ప్రేమిస్తున్న అమ్మాయిని మీరెలా చేసుకుంటారని వరుడి కుటుంబాన్ని బెదిరించాడు. దాంతో వాళ్లు ఆందోళన చెంది శ్రీనీల సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలతో విరక్తి చెందిన శ్రీనీల ఫిబ్రవరి 28న ఇంట్లో ఉన్న యాసిడ్, సూపర్ వాస్మాల్ రసాయనాలను తాగేసింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించగా, పరిస్థితి విషమించడంతో మంగళవారం మరణించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.