పెళ్లికి నిరాకరించిందనే కారణంతో వైశాలి అనే యువతిని మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసిన వ్యవహారం మరవకుముందే తెలంగాణలో మరోసారి అదే తరహా ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లాలో ప్రేమించడం లేదని విద్యార్థినిని ఓ యువకుడు కిడ్నాప్‌కు యత్నించాడు. స్నేహితులతో కలిసి ఆటోలో యువతిని బలవంతంగా తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక ఆటో ఆగిపోవడంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించి ఓ ఫారెస్ట్ అధికారి సాయంతో పోలీసులు సమాచారం అందించింది..
అమ్మాయి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ప్రకారం ..మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ మండలానికి చెందిన విద్యార్థి ఇంటర్ చదువుతోంది. ఆమెను కొంత కాలంగా శంకర్ అనే యువకుడు ప్రేమించాలని వెంటబడుతున్నాడు. ఈ క్రమంలోనే సాయంత్రం ఆటో వేసుకుని కాలేజ్ దగ్గరకు వెళ్ళి అమ్మాయిని ఎక్కించుకునేందుకు ప్రయత్నించారు. మీ నాన్న తీసుకురమ్మన్నారని, ఆటో ఎక్కాలని కోరారు. ఆమెకు ఆనుమానం వచ్చి ఆటోలో ఎక్కకుండా బస్సులో వెళ్లిపోయింది. యువతి బస్సును ఫాలో అయిన గ్యాంగ్.. ఆమె బస్సు దిగగానే నోరు నొక్కి ఆటో ఎక్కించుకుని చెన్నూరు వెళ్లారు.ఆటో అక్కడ ఆగిపోవడంతో యువతి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆటో దిగి పరుగులు పెట్టింది. కానీ మళ్లీ వారు బలవంతంగా ఆమెను లాకెళ్లారు. ఈ విషయాన్ని గమనించినా ఓ ఫారెస్ట్ వారి వద్దకు వెళ్లి ఆరా తీయగా విషయం బయటపడింది. తనను కాపాడాలని యువతి వేడుకోవడంతో ఫారెస్ట్ అధికారిణి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.