తండ్రీ కొడుకులపై కన్నేసిన అక్కా చెల్లెళ్లు.. లొంగకపోవడంతో చివరికి - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రీ కొడుకులపై కన్నేసిన అక్కా చెల్లెళ్లు.. లొంగకపోవడంతో చివరికి

April 14, 2022

15

ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ యువకుడిని ట్రాప్ చేయడానికి యత్నించి విఫలమైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. జైపూరుకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి తన కొడుకు విపుల్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. విపుల్‌కు మూడేళ్ల క్రితం పెళ్లికాగా, రెండేళ్ల క్రితం భార్య చనిపోయింది. ఈ క్రమంలో తండ్రీ కొడుకులిద్దరే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది వారి పక్కింట్లోకి రాధిక, ఏక్తా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు అద్దెకు దిగారు. మంచి మాటలతో, సత్ప్రవర్తనతో తండ్రీ కొడుకులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఈ క్రమంలో రాధిక విపుల్‌ను ట్రాప్ చేసి వారి ఆస్తిని కాజేయాలని భావించింది. అందులో భాగంగా లవ్ ప్రపోజల్ పెట్టగా, విపుల్ దానిని తిరస్కరించాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఆగ్రహించిన రాధిక.. తనను పెళ్లి చేసుకోవాలనీ, లేదంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. దీంతో తండ్రీకొడుకులు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.