The youth who woke up the fire mountain.. Here is the video
mictv telugu

అగ్ని పర్వతాన్ని నిద్రలేపిన యువకులు..వీడియో ఇదిగో

August 22, 2022

The youth who woke up the fire mountain.. Here is the video

ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియా ద్వారా అవి ప్రజలకు చేరుతున్నాయి. అందులో కొన్ని మంచి సంఘటనలకు సంబంధించినవైతే, మరికొన్ని చెడుకు సంబంధించిన కూడా ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో జరిగిన సంఘటన ఏ దేశంలో జరిగిందో మనకైతే తెలియదు గానీ, తెగ వైరల్‌ అవుతుంది. ఇద్దరు యువకులు చేసిన పనికి, ప్రపంచ దేశ ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాదు, ఈ భూమిపై బ్రతికినంత కాలం దేనితోనైనా పెట్టుకోవచ్చు గానీ, అగ్నితో మాత్రం అసలు పెట్టుకోకూడదంటూ హితవు పలుకుతున్నారు. మరి ఆ వీడియో ఏంటీ? అందులో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే..

”ఇద్దరు యువకులు ఎత్తైన కొండపై నిలబడి, ఓ చిన్న రాయిని కిందకు విసిరారు. అంతకుముందు నుంచే క్రింద అగ్ని పర్వతం ప్రశాంతంగా ఉంది. ఆ క్రింద ఉన్నది ఒక అగ్నిపర్వతం. రాయి కింద పడగానే లావా చిమ్మడం మొదలైంది. అది చిన్నగా మొదలై, క్రమంగా క్రమంగా  పెద్ద మంటలు చేలరేగటం మొదలైంది. మంటలుపైకి చిమ్ముతుండటం చూస్తుంటే చూసేవారికి భయాన్ని కల్గిస్తున్నాయి. అయితే, ఈ ఘటన చూసిన ప్రతివారు ఆ యువకులపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇక, అగ్ని పర్వతాల విషయానికొస్తే..”ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వాటిల్లో ఈ అగ్ని పర్వతాలు ఒకటి. ఈ అగ్నిపర్వతాలు నివురుగప్పిన నిప్పులాంటివి. అవి ఎప్పుడు ఎలా విస్ఫోటనం చెంది, విధ్వంసాన్ని సృష్టిస్తాయో ఎవరికీ తెలియదు. అందుకే అగ్ని పర్వతాల దగ్గర మానవులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. నిద్రపోతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై, విధ్వంసం సృష్టిస్తే, ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జీవనాన్ని కష్టతరం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వందలాది అగ్నిపర్వతాలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్నిపర్వతాలు చిందించే లావా చాలా ప్రమాదకరం. మనిషి ఎముకలను కూడా క్షణంలో కరిగించగలదు” అటువంటి అగ్ని పర్వతాన్ని ఒక్క రాయితో నిద్రలేపిన యువకులపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.