'ఆర్ఆర్ఆర్' అభిమానులకు థియేటర్స్ హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు థియేటర్స్ హెచ్చరిక

March 23, 2022

 

resave rrr

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని సినిమా హాల్స్ యాజమాన్యాలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అభిమానులకు హెచ్చరికలు జారీ చేశాయి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణలోని సినిమా హాల్స్ అన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాల వద్ధ అభిమానులు భారీ కటౌట్లు, ప్లెక్సీలను కట్టారు. అయితే, సినిమా విడుదల రోజున అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న కారణంగా సినిమాలు హాల్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా సినిమా హాల్స్ ఓనర్స్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా సినిమా ప్రసారమయ్యే స్క్రీన్ వద్దకు వెళ్లి అభిమానులు సందడి చేయడం, కొన్నిసార్లు స్క్రీన్లు చింపేసి హంగామా గతంలో మనం ఎక్కువగా చూశాము. అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు సినిమాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్క్రీన్ల ముందు మేకులు కొట్టించారు. దీనికి సంబంధించిన  ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా విడుదల రోజున సినిమా హాల్స్ వద్ద పోలీసు బందోబస్తు కావాలని కొంతమంది ఓనర్స్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులను కోరుతున్నారు.

మరోవైపు ఆయా హీరో అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా చూసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేలా థియేటర్ ఓనర్లతో ఆయా నటీనటుల అభిమాన సంఘాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో థియేటర్స్ ఓనర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.