Home > Featured > ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదలయ్యే చిత్రాలివే

ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదలయ్యే చిత్రాలివే

Theatres Ott Release Movies In This Week Krishna Vrinda Vihari Alluri

గత వారం బాక్సాఫీసు వద్ద సందడి చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని', 'శాకిని డాకిని' తదితర చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ వారం విడుదలయ్యే సినిమాలు కచ్చితంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఏ ఏ సినిమాలు రాబోతున్నాయో చుద్దాం.

యంగ్ హీరో నాగశౌర్య ఈసారి కృష్ణ వ్రిందా విహారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈనెల 23వ తేదీన రాబోతోంది. ఇక మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా, కయాదు లోహార్ హీరోయిన్ గా అల్లూరి అనే సినిమా కూడా అదే రోజు విడుదలకు సిద్ధమైంది. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో రూపొందిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా కూడా 23వ తేదీ విడుదలవుతోంది.

ఇక ఈ సినిమాలతో పాటు ఓటీటీలో కూడా పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌ల విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్‌ లో ద పెర్‌ఫ్యూమర్‌ అనే హాలీవుడ్‌ సినిమా సెప్టెంబరు 21, జంతరా అనే హిందీ సిరీస్‌ సెప్టెంబరు 23న రిలీజ్ అవుతోంది, ఎల్‌వోయూ అనే ఒక హాలీవుడ్ సినిమా సెప్టెంబరు 23న రిలీజ్ అవుతున్నాయి. ఇక డిస్నీ+హాట్‌స్టార్‌ లో సెప్టెంబరు 21న అందోర్‌ వెబ్‌సిరీస్‌, సెప్టెంబరు 22న ద కర్దాషియన్స్‌ అనే వెబ్‌సిరీస్‌2, సెప్టెంబరు 23న బబ్లీ బౌన్సర్‌ అనే తెలుగు సినిమా విడుదల అవుతున్నాయి. ఆహా లో సెప్టెంబరు 23న ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా, అదే రోజున డైరీ అనే తమిళ సినిమా రిలీజ్ అవుతున్నాయి. హీరో ధనుష్ నటించిన తిరు కూడా సన్‌నెక్స్ట్ ద్వారా 23 న స్ట్రీమింగ్ కానుంది.

Updated : 19 Sep 2022 5:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top