దొంగతనమెందుకు? చావడం ఎందుకు?: కోడైల మృతిపై ‘పిల్లి’ - MicTv.in - Telugu News
mictv telugu

దొంగతనమెందుకు? చావడం ఎందుకు?: కోడైల మృతిపై ‘పిల్లి’

September 16, 2019

Pilli Subhash Chandra Bose

ఒక మరణం రెండు రాజకీయాలు అన్నట్టు సాగుతున్నాయి ఇప్పుడు ఏపీ రాజకీయాలు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకున్నట్టే కనిపిస్తోంది. అధికార పార్టీ వేధింపుల వల్లే కోడెల తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా స్పందించారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వైసీపీ హత్య అంటూ టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. ఎవరు దొంగతనం చేయమన్నారు? ఎవరు చనిపోమన్నారు? అని ప్రశ్నించారు. 

దొంగతనానికి సంబంధించి కేసు కూడా నమోదు అయ్యిందని చెప్పారు. కోడెల దొంగతనం చేసినట్లు ఆయనే ఒప్పుకున్నారని తెలిపారు. అందుకు డబ్బులు కూడా కడతానని ఆయన స్వయంగా ప్రకటించారని అన్నారు. కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదని స్పష్టంచేశారు. ఆయనపై రెండే కేసులు ఉన్నాయని.. ఒకటి దొంగతనం కేసు రెండోది ఆయన కోడలు పెట్టిన కేసు అని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలకు ముఖం చూపించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని.. ఇది చాలా దురదృష్టకరమని, బాధాకరమని అన్నారు.