కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.3 లక్షల నగదు, రూ. 3.5 లక్షల విలువైన బంగారు నగలు గల్లంతయ్యాయి. రేణుక విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దొంగలను కనిపెట్టాలంటూ ఈ రోజు బంజారాహిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పనిచేసే ముగ్గురిపై అనుమానం ఉందని తెలిపారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గతంలో రేణుక కుమార్తె తేజస్విని చౌదరి ఇంట్లోనూ చోరీ జరిగింది. రూ.9 లక్షల విలువైన వస్తువులు పోయాయి. అప్పుడూ పనిమనిషిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తేజస్విని దంపతులు ఢిల్లీ వెళ్లినప్పుడు చోరీ జరిగింది. అల్మారాలో దాచిన రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల విలువైన కార్డియర్ గడియారం, రూ.3 లక్షల నగదు మాయమయ్యాయి.