తెలంగాణ పోలీస్ కమాండ్ సెంటర్‌లో దొంగతనం - Telugu News - Mic tv
mictv telugu

తెలంగాణ పోలీస్ కమాండ్ సెంటర్‌లో దొంగతనం

June 11, 2022

 

నిత్యం పెద్దసంఖ్యలో పోలీసులు తిరిగే స్థావరం అది. రాష్ట్రవ్యాప్తంగా నిఘా కోసం కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంది. ఇంకెక్కడా చాన్స్ దొరకనట్లు దొంగలు అక్కడే పని కానిచ్చేశారు. ఖరీదైన రాగి తీగల బండిల్స్‌ను దర్జాగా ఎత్తుకెళ్లారు. జూబిలీ హిల్స్‌లోని తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 30 కాపర్ బండిల్స్ చోరీ అయ్యాయి. నిర్మాణాల కోసం కాంట్రాక్టు కంపెనీ వీటిని అక్కడ ఉంచగా కన్నేసిన దొంగలు కొట్టేశారు. కంపెనీ ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పటిష్టమైన నిఘా ఉండే భవనంలో ఇలాంటి చోరీ జరగడంతో పోలీస్ బాస్‌లు అవాక్కయ్యారు. కంపెనీ సిబ్బందిని, అనుమానితులను విచారిస్తున్నారు.