Home > Featured > గుడిలో దొంగల బీభత్సం.. 3 కిలోల వెండి చోరీ.. 

గుడిలో దొంగల బీభత్సం.. 3 కిలోల వెండి చోరీ.. 

Temple....

గుడి బయట చెప్పులు కనిపిస్తేనే వదిలిపెట్టని దొంగలు దేవుని కిరీటాన్ని వదిలి పెడతారా? భయం, భక్తి లేకుండా అస్సలు వదిలిపెట్టము అన్నంత పనిచేశారు. గుడి తాళాలు పగులగొట్టి స్వామివారి వెండి కిరీటం, అమ్మవారి బంగారు మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. కృష్ణా జిల్లా పెద్దవరం మండలంలోని శ్రీ పార్వతీ సమేత నీలకంఠ స్వామి గుడిలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో మూడు కిలోల వెండి ఆభరణాలు(2 కిలోలతో తయారుచేసిన సర్వాయనం, పావుకేజీ అమ్మవారి వెండికిరీటం, పావుకేజీ స్వామివారి వెండి కమలం) 25 గ్రాముల అమ్మవారి బంగారం చోరీ జరిగినట్టుగా గుడి పూజారులు పోలీసులకు తెలిపారు. అర్చకుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటాం అని పోలీసులు తెలిపారు.

Updated : 31 Aug 2019 6:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top