పాపం.. దొంగతనానికి కొత్తేమో..!   - MicTv.in - Telugu News
mictv telugu

పాపం.. దొంగతనానికి కొత్తేమో..!  

March 15, 2018

కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత. ఎందులోనైనా అభ్యాసం ఉండాలి. చివరకు దొంగతనంలోనూ. లేకపోతే.. ఇదులో ఈ దొంగలా పట్టుబడి నవ్వులపాలు కావడం ఖాయం. ఓ తెలివి తక్కువ చోరశిఖామని.. తన ముఖం కనిపించకూడదని పారదర్శక ప్లాస్టిక్ కవర్‌ను ముఖానికి తగలించుని చోరీ చేశారు. ప్లాస్టిక్ కవర్ అతన్ని ముఖాన్ని దాచకపోవడంతో అడ్డంగా బుక్కై కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. ఈ బుర్రలేని దొంగ ముచ్చట తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగింది.

పట్టణంలోని ఓ మొబైల్ షాపులోకి ఓ ప్లాస్టిక్ కవర్ ముసుగు దొంగ చొరబడ్డాడు. అటూఇటూ చూసి షాపులో పనికానిచ్చేశాడు. లక్ష రూపాయలను కాజేశాడు. ఈ మొత్తం తతంగమంతా సీసీ కెమరాల్లో రికార్డయింది. అయ్యగారి చేతిపై ఉన్న పచ్చబొట్టుతో సహా. పొద్దున షాపు తెరిచిన యజమాని.. డబ్బుపోయిందని తెలిసి కంగారు పడ్డాడు. తర్వాత సీసీ ఫుటేజీ చేసి నవ్వుకున్నాడు. దాని పోలీసులకు అందించడంతో వారు కొన్ని గంటల్లోని తిక్కదొంగను అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయిపోయింది. మీరూ చూడండి మరి.