వార్తల కోసం టీవీల్లో లైవ్ చెప్పే సమయంలో రిపోర్టర్లకు కొన్నిసార్లు ఊహించని పరిణామాలు ఏర్పడతాయి. కెమెరా ఆన్ చేయగానే పక్కనే ఉన్న కొంత మంది పోకిరీలు పిచ్చి చేష్టలు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి అయితే అతడు లైవ్ ఇస్తుండగానే ఫోన్ దొంగతనం చేసుసి పారిపోయాడు. చేతిలో నుంచి లాక్కొని పారిపోతుండగా అతడి కోసం రిపోర్టర్ వెంటపడ్డాడు. దొంగ దొంగ అంటూ వెంబడించిన వీడియో టీవీలో ప్రసారం అయింది. అర్జెంటీనాలో ఈ తతంగం జరిగింది.
బ్యూనస్ ఎయిర్స్లో ఓ టీవీ రిపోర్టర్ డీగో డెమార్కో ఏదో న్యూస్ లైవ్ ఇద్దామని కెమెరా ముందు నిలబడి ఉన్నాడు. అప్పటికే అతన్ని గమనిస్తున్న దొంగ అదును కోసం చూశాడు. చేతిలో ఫోన్ పట్టుకొని నిలబడి వార్త చెప్పే క్రమంలో ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. దాన్ని లక్కొని సందుల్లోకి పరిగెత్తాడు. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్టోబర్ 20న ఇది జరిగింది. తనను గుర్తు పట్టకుండా ఆ దొంగ ముందు జాగ్రత్తగా ఫేస్ మాస్కు కూడా పెట్టుకున్నారు. కెమెరా ఆన్‌లో ఉండటంతో అదంతా ప్రసారం అయింది. జనం కూడా అతడి వెంటపడ్డారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చివరకు అతడు ఆ మొబైల్ తిరిగి ఇచ్చేశాడు. జనాలకు బయపడి మళ్లీ వెనక్కి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.