Then Huzurabad..now Munugodu..same to same audio..will it change the poll scene?
mictv telugu

అప్పుడు హుజూరాబాద్..ఇప్పుడు మునుగోడు..సేమ్ టు సేమ్ ఆడియో..పోల్ సీన్ ని మార్చేస్తుందా?

October 21, 2022

ఉప ఎన్నికల వేళ ఆడియోల కలకలం. అప్పుడు హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి ఆడియో.ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో.ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి ఓటేయాలన్న ఈ ఆడియో టేపుల్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు. హుజూరాబాద్ లాగే మునుగోడు బైపోల్ సినారియోని మార్చేస్తారా?అసలేం జరగబోతోంది.

అప్పుడు హుజూరాబాద్..ఇప్పుడు మునుగోడు.సేమ్ టు సేమ్ ఆడియోలు..పార్టీలు వేరు..నేతలు వేరు అంతే.ఆడియోల్లో ఇద్దరు మాట్లాడిన మాటల సారాంశం ఒక్కటే. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటేయాలని పిలుపు. అంటే నీడనిస్తున్న పార్టీని నిట్టనిలువునా ముంచేయాలని.వీరి వ్యాఖ్యల్ని ప్రజలు కూడా ఒప్పుకోరేమో. ఎందుకంటే ద్రోహాన్ని సాహించడం మనిషి నైజం కాదు.నిజాయితీగా పోరాడాలి. అప్పుడే మీ వెంట మేమున్నమంటారు జనం.లేదంటే హుజూరాబాద్ లో లాగే రిజల్ట్ రివర్స్ కొడుతోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికవేళ కాంగ్రెస్‌లో ఉంటూ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్ హుజూరాబాద్ లో కలకలం రేపింది. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పుకంటూ మరోవైపు హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న విషయం ఈ ఆడియో ద్వారా వైరల్ అయింది. తీరా అసలు ఫలితం రివర్స్ లో వచ్చింది. ఇప్పుడు మరి ఈ ఆడియో…?

బీజేపీకే ఓటేయండి..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియోలో ఏం ఉందంటే

మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రచారానికి దూరంగా వున్న వెంకట్ రెడ్డి…తాజాగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పారు. ఫోన్లలో జరిగిన ఈ సంబాషణకు చెందిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో పలువురు కాంగ్రెస్ నేతలతో వెంకట్ రెడ్డి మాట్లాడారు. పార్టీలను పక్కనపెట్టి రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలని కోరారు. ఈ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. అంతటితో ఆగని వెంకట్ రెడ్డి…ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ ను అవుతానని కూడా అన్నారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని, రాష్ట్రానికి సీఎంను కూడా అవుతానని ఆయన అన్నారు.

Then Huzurabad..now Munugodu..same to same audio..will it change the poll scene?

కాంగ్రెస్‌లోనే ఇలా…

కాంగ్రెస్‌లో అందరూ ఫ్రీ బర్డ్స్.ఎవరికి తోచింది వారు మాట్లాడుతారు. పార్టీ లైన్ లేదు..ఏం లేదు.నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తారు. పార్టీ హైకమాండ్ వీరిని ఏం చేయలేదు. ఏదో మహా అయితే షోకాజ్ నోటీసులు ఇస్తుంది. అక్కడితోనే వారినే వదిలేస్తుంది. కొన్నిసార్లు ఢిల్లీ పెద్దలు ఇలాంటోళ్లను ఎంటర్ టైన్ చేస్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇలాగే వ్యవహారిస్తోంది. తమ్ముడు వేరే పార్టీలోకి వెళ్లిపోయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఏమి అనలేదు. రేవంత్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా చూస్తూ వుండిపోయింది. ఆఖరకు మునుగోడు ప్రచారానికి దూరంగా వుంటానని తెగేసి చెప్పినా ఏమి చేయలేకపోయింది. ఇంకో అడుగు ముందుకేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…బీజేపీకే ఓటేయాలని కాంగ్రెస్ నాయకుల్ని,కార్యకర్తల్ని కోరారు. ఇంతా ధైర్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారంటే …ప్రచారం చేస్తున్న నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటి?టీపీసీసీ చీఫ్ మునుగోడు ప్రచారంలో మునిగితేలుతుండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం?అందుకేనేమో ఏం చేయలేక రేవంత్ రెడ్డి గురువారం కన్నీళ్లు పెట్టుకున్నారేమో.ఇది జరిగిన మరుసటిరోజే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో రావడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.

ఈ ఆడియోతో మునుగోడు పోల్ సీన్ మారుతుందా?

ఉప ఎన్నికల్లో ఇలాంటి ఆడియోలు రివర్స్ అయ్యాయి..అప్పట్లో హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ఆడియో విషయంలో ఇదే జరిగింది. ఇప్పుుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో నవంబర్ 6దాకా ఆగాలి.