జాతీయ జెండానే కాదు, జాతిపితనూ వదల్లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

జాతీయ జెండానే కాదు, జాతిపితనూ వదల్లేదు..

November 22, 2019

కార్యకర్తలకు పార్టీ మీద ప్రేమ ఎక్కువ అవుతున్నట్టుంది.  మొన్న అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామ సచివాలయ భవనం గోడకు ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైసీపీ పార్టీకి సంబందించిన రంగులను పెయింటింగ్ చేసిన విషయం తెలిసిందే. దానిపై ఎంత రచ్చ జరిగిందో.. ఆ తర్వాత వైసీపీ రంగును తొలగించి యథావిధిగా జాతీయ జెండాను చిత్రించారు. ఆ విషయం గురించి మరిచిపోక ముందే మరో అతికి దారితీశారు సదరు పార్టీ కార్యకర్తలు. అప్పుడు జాతీయ పతాకాన్ని మార్చేస్తే.. ఇప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని టార్గెట్ చేశారు.

YSRCP

గాంధీ విగ్రహ దిమ్మెకు వేసిన వైకాపా రంగులు వివాదంగా మారాయి. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం భైరిపురం పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. మాజీ సర్పంచి కెంగువ ధనంజయ తన తల్లి జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేంది ఇప్పుడు దీనికి వైసీపీ రంగులు వేయించారని ధనంజయ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు.