తెలంగాణలో 5,083 పోస్టులు ఉన్నాయి..త్వరలోనే ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 5,083 పోస్టులు ఉన్నాయి..త్వరలోనే ప్రకటన

June 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో మరో 5,083 పోస్టులకు ప్రకటన వెలవడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని అధికారులు గుర్తించి, సోమవారం ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. మొత్తం ఉన్నత విద్యలో 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్, సాంకేతిక విద్య, యూనివర్సిటీలు, కాలేజీ ఎడ్యుకే షన్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలను అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసు శాఖలో, గ్రూప్ 1 శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే ఉన్నత విద్యలో ఖాళీగా ఉన్న 5,083 ఉద్యోగాలకు జెండా ఊపనుంది.

నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ”ఖాళీ పోస్టుల్లో 11 యూనివర్సిటీల్లో 482 బోధనేతర, 1,892 బోధన పోస్టులు ఉన్నాయి. ఇంటర్ బోర్డు పరిధిలో 52 జూనియర్ అసిస్టెంట్లు, ఇంటర్ ఎడ్యుకేషన్ కమిషనర్ పరిధిలో 1,392 జూనియర్ లెక్చరర్లు, 91 ఫిజికల్ డైరెక్టర్లు, 40 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. కాలేజీ విద్యలో 491 లెక్చరర్, 29 ఫిజికల్ డైరెక్టర్లు, 24 లైబ్రేరియన్, 2 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సాంకేతిక విద్యలో 247 లెక్చరర్, 37 ఫిజికల్ డైరెక్టర్లు, 31 లైబ్రేరియన్, 26 జూనియర్ పోస్టులు ఉన్నాయి.

1.ఇంటర్మీడియట్ కమిషనరేట్ 1,523
2.జూనియర్ లెక్చరర్: 1392
3.ఫిజికల్ డైరెక్టర్: 91
4.లైబ్రేరియన్: 40
5.కళాశాల విద్య కమిషనరేట్ 546
6.లెక్చరర్: 491
7.ఫిజికల్ డైరెక్టర్: 29
8.లైబ్రేరియన్: 24
9.జూనియర్ అసిస్టెంట్: 2
10.సాంకేతిక విద్య కమిషనరేట్ 568
11.లెక్చరర్: 247
12.ఫిజికల్ డైరెక్టర్: 37
13.లైబ్రేరియన్: 31
14.జూనియర్ అసిస్టెంట్: 12
15.జూనియర్ ఇన్‌స్ట్రక్టర్: 14
16.ఎలక్టీషియన్: 25
17.మాట్రన్. 5
18.ల్యాబ్ అటెండర్: 197

11 యూనివర్సిటీల్లో 2,374 పోస్టులు ఉన్నాయి. అందులో..
1.బోధన సిబ్బంది. 1892
2.బోధనేతర సిబ్బంది: 482
3.ఇంటర్మీడియట్ బోర్డు- జూనియర్ అసిస్టెంట్: 52
4.తెలంగాణ ఆర్కైవ్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్: 20