There are rumors that Chinese President Jin Ping is under house arrest
mictv telugu

చైనాలో సైన్యం తిరుగుబాటు.. హౌస్ అరెస్ట్ అయిన జిన్ పింగ్?

September 24, 2022

There are rumors that Chinese President Jin Ping is under house arrest

చైనాకు సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. అధ్యక్షుడు జిన్ పింగ్‌ని గృహ నిర్భంధం చేశారని, చైనీస్ సైన్యం బీజింగ్ దిశగా కదులుతోందని ఆ రూమర్ సారాంశం. చైనా ఆర్మీ చీఫ్ లి ఖియావోమింగ్ జిన్ పింగ్ స్థానంలో నియమితులయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. షాంఘై కో ఆపరేషన్ సమావేశంలో పాల్గొనడానికి దాదాపు రెండేళ్ల తర్వాత దేశం దాటి బయటికి వచ్చిన జిన్ పింగ్‌ను అదే సమయంలో ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించారనే వార్త చక్కర్లు కొడుతోంది.

చైనీస్ ఆర్మీ బీజింగ్ వైపు వెళ్తోందంటూ అమెరికాలో నివాసం ఉంటున్న చైనీస్ మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జెంగ్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశాడు. దీనికి చైనా రచయిత అమెరికాలోనే నివాసముండే గోర్డాన్ చాంగ్ బదులిస్తూ.. శుక్రవారం చైనాలో 60 శాతం విమానాలు ఎలాంటి సమాచారం లేకుండానే నిలిచిపోయాయని, దేశీయ విమానాలు సైతం తక్కువ ఎత్తులో ప్రయాణించాయని చెప్పారు. ఇప్పటికే సీనియర్ అధికారులను జైల్లో పెట్టారని, కమ్యూనిస్టు పార్టీతో పాటు చైనాలో అస్థిరత నెలకొందని అన్నారు. ఈ రూమర్లపై బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి కూడా స్పందించారు. అందులో ఎంతవరకు వాస్తవముందో తేలాల్సి ఉందని ట్వీట్ చేశారు. అయితే ప్రధాన మీడియా సంస్థలలో ఈ వార్త గురించి ఎలాంటి కథనాలు రాలేదు. అటు చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్‌ కూడా స్పందించలేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు తెలియదు. కాగా, వచ్చే నెలలో కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ జరుగనుంది. అక్కడ మరో ఐదేళ్లు అధికారంలో ఉండడానికి జిన్ పింగ్ పావులు కదుపుతారని ప్రచారం జరిగింది. ఇంతలో ఈ రూమర్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.