There are two and a half lakh voters in India who are over 100 years old: EC
mictv telugu

వందేళ్లు దాటిన ఓటర్లు ఎందరు ఉన్నారో చెప్పేసిన ఈసీ

November 10, 2022

దేశ తొలి ఓటరు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్యామ్ సర్ నేగిని ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. 105 ఏళ్ల వయసు కలిగిన నేగి.. చనిపోయే మూడ్రోజుల ముందు కూడా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో దేశంలో వందేళ్లు దాటిన ఓటర్లు ఎంత మంది ఉంటారనే ఆసక్తి పెరిగింది.

ఈ క్రమంలో ఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆ వివరాలను గురువారం మీడియాకు వెల్లడించింది. దేశంలో వందేళ్లు దాటిన ఓటర్లు 2.50 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది. 80 ఏళ్లు దాటిన ఓటర్లు 1 కోటి 83 లక్షల 53 వేల 347 మంది ఉన్నారు. 20- 29 మధ్య వయసు వారు 20 కోట్ల 6 లక్షల 65 వేల 436 మంది ఉన్నారని వివరించింది. టీనేజ్ ఓటర్లు అంటే 18-19 మధ్య వయసు వారు 1 కోటి 52 లక్షల 34 వేల 341 అంటూ గణాంకాలను విడుదల చేశారు. అలాగే ఈసీ తరపున ప్రజలకు ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నామని, అందుకోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు.