కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడు - MicTv.in - Telugu News
mictv telugu

కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడు

May 15, 2022

ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి ఇటీవలే యూట్యూబ్‌లో ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డిని నడి రోడ్డుపై చితకబాదిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నేటికి తెగ వైరల్ అవుతోంది.

తాజాగా మరో బాధితుడు కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ”గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా, ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది. వెంగళరావు నగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్‌ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి, మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. దాంతో నన్ను అడగడానికి నువ్వెవరంటూ కరాటే కల్యాణి ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి.. నాపైనే ఫిర్యాదు చేస్తావా, నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు” తెలిపారు. తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్‌ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.