There is a possibility of loss of Brahmastra movie in Hyderabad
mictv telugu

బ్రహ్మాస్త్రకు హైదరాబాద్‌లో ఎదురు దెబ్బ.. మొదటి రోజే కోట్లల్లో నష్టం!

September 8, 2022

There is a possibility of loss of Brahmastra movie in Hyderabad

బాలీవుడ్ నూతన దంపతులు రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. సుమారు రూ. 410 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

సౌతిండియాలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 8 వేల స్క్రీన్స్‌లో, ఇండియాలో 5 వేల స్క్రీన్స్‌లో భారీ ఎత్తున రిలీజవుతోంది. కొన్ని చోట్ల ఇప్పటికే బుకింగ్స్ మొదలవగా, వాటి స్పీడు చూస్తుంటే ఈ చిత్రం మొదటిరోజే 30 నుంచి 35 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి హైదరాబాదులో రిలీజ్ రోజే షాక్ తగలనుంది. ఎందుకంటే ఈ చిత్రం రిలీజ్ రోజే నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పలు చోట్ల థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ప్రసాద్ ఐమాక్స్ వంటి థియేటర్లు తెరచుకోవడం లేదు. దీని వల్ల వందల షోలు రద్దవగా, మేకర్స్‌కి కోట్లలో నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. కనీసం ఎంత లేదన్న రెండు మూడు కోట్ల రూపాయల వరకు ఈ నష్టం ఉంటుందని చర్చించుకుంటున్నారు. మరి తర్వాతి రోజు నుంచి కలెక్షన్స్ ఏమేరకు ఉంటాయో వేచి చూడాలి. కాగా, ఈ చిత్రంపై కూడా ఉత్తరాదిలో బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ వ్యతిరేకత వస్తుండడం గమనార్హం. హిందూ పురాణాలలో ఉన్న అస్త్రాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పలు హిందూ సంఘాలే ఉత్తరాదిన వ్యతిరేకిస్తున్నాయి. దీనికి రణబీర్ కపూర్, అలియా భట్‌లు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లే కారణమని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.