'ఆర్ఆర్ఆర్'కు సీక్వెల్ కూడా ఉంది: విజయేంద్ర ప్రసాద్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ కూడా ఉంది: విజయేంద్ర ప్రసాద్

April 5, 2022

rrr

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలే తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా విడుదలైన రోజు నుంచి నేటీవరకు భారీ కలెక్షన్లను రాబడుతుంది. అయితే, రాంచరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహుబలి సినిమా వలే ‘ఆర్ఆర్ఆర్ 2’ కూడా వస్తే బాగుంటుంది అని సోషల్ మీడియా వేదికగా రాజమౌళిని అడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించాడు.

”దేవుడి దయతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. త్వరలోనే కథను సిద్ధం చేయబోతున్నాం” అని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో తారక్, రాంచరణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోపక్క రాజమౌళి తెరకెక్కించిన సినిమాల విజయాల వెనుక రాజమౌళి కృషి ఎంత ఉందో, ఆయన తండ్రి కథ రచయిత విజయేంద్రప్రసాద్ క్రెడిట్ కూడా అంతే ఉంది. అద్భుతమైన కథలను రాయడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఘన విజయం సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కూడా ఆయనే కథ అందించారు. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? అనే ఉత్సుకత సినీ అభిమానులందరిలో ఉండడంతో సీక్వెల్ కూడా ఉందని ఆయన స్పష్టతనిచ్చారు.