'కేజీఎఫ్ ఛాపర్ట్ 3' కూడా ఉంది: డైరెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘కేజీఎఫ్ ఛాపర్ట్ 3’ కూడా ఉంది: డైరెక్టర్

April 14, 2022

kgff

సినీ ప్రేక్షకులకు కన్నడ హీరో యశ్(రాఖీ బాయ్) అంటే తెలియని వారుండరు. ఎందుకంటే..కేరీర్ ప్రారంభం నుంచి యశ్ పలు సినిమాలు చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్ ఛాపర్ట్ 1’ సినిమాతోనే అన్నీ భాషల సినీ ప్రియులకు దగ్గరయ్యాడు. కేజీఎఫ్ ఛాపర్ట్ 1లో ఆయన చెప్పిన డైలాగులు, యాక్షన్, డ్యాన్స్, పైటింగులు యావత్ సినీ అభిమానులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. దీంతో ‘కేజీఎఫ్ ఛాపర్ట్ 2’ ఎప్పుడెప్పుడు వస్తుంది? మళ్లీ రాఖీ బాయ్ విశ్వరూపాన్ని చూడాలి? అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు గురువారం (ఈరోజు) ‘కేజీఎఫ్ ఛాపర్ట్ 2’ విడుదలైంది. అభిమానుల ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కింది. సినిమా సూపర్‌గా ఉందంటూ యశ్ అభిమానులు కేరింతలు, ఈలలు, నినాదాలు చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు మళ్లీ సీక్వెల్ ఉంటుందా ? ఉండదా ? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కేజీఎఫ్ 2 ప్రమోషన్లలో చిత్రబృందానికి సీక్వెల్‌పై ప్రశ్నల మీద ప్రశ్నలు ఎదురయ్యాయి. ఫస్ట్ ఈ మూవీ విడుదలై, రిజల్ట్ రానీయండి అంటూ సమాధానం దాటవేసిన ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ ఛాపర్ట్ 2 ఎండింగ్‌లో ”కేజీఎఫ్ ఛాపర్ట్ 3” లోడింగ్ అంటూ అధికారికంగా ప్రకటించాడు. దీంతో అభిమానులను పుల్ ఖుషి అవుతున్నారు. ఒకవైపు థియటర్లలో కేజీఎఫ్ 2 జాతర జరుగుతుండగా, మరోవైపు కేజీఎఫ్ 3పై భారీగా అభిమానులు భారీ అంచనాలను పెంచేసుకుంటున్నారు.