there is no dangerous to humans with that worm.. scientist gave clarity
mictv telugu

అదంతా ఫేక్.. ఆ పురుగును తాకితే ప్రాణం పోదు..

September 17, 2022

గత కొన్నిరోజులుగా గొంగళి పురుగు ఆకారంలో ఉండే ఓ పురుగు మనుషులను కుడితే ఐదు నిమిషాల్లో మరణిస్తారని సోషల్ మీడియాలో ప్రచారంలో జరుగుతుంది. పత్తి పంటలో ఉండే ఈ పురుగు మనిషిని తాకిన వెంటనే 5 నిమిషాల్లో చనిపోతున్నారని వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. జాగ్రత్తగా ఉండండి అని అందర్నీ భయపెడుతూ పురుగు ఫోటోలు, చనిపోయినట్టు ఉన్న మనుషుల ఫోటోలను, ఆడియో మెసేజ్‌లను ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు.

అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రెడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ మళ్లీశ్వరి తెలిపారు. ఈ పురుగును నేటిల్‌మాత్‌ అంటారని చెప్పారు. ఇది ఎక్కువగా విదేశీ అడవుల్లో ఉంటుందని, మన దేశంలో చాలా అరుదుగా పండ్లతోటల్లో కనిపిస్తుందన్నారు. ఈ పురుగును తాకితే మంట, దురద ఏర్పడుతుందని, అది కూడా ఒక్క రోజులోనే తగ్గిపోతుందన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.