గెలిచే వరకు వెనక్కు తగ్గేదే లేదు: రష్యా - MicTv.in - Telugu News
mictv telugu

గెలిచే వరకు వెనక్కు తగ్గేదే లేదు: రష్యా

March 1, 2022

bfgbfg

ఉక్రెయిన్ దేశంపై రష్యా దేశం ప్రకటించిన యుద్ధం విషయంలో మంగళవారం ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ”అనుకున్న లక్ష్యం చేరేవరకూ రష్యా బలగాలు వెనక్కు తగ్గేదే లేదు” అంటూ ప్రకటించాడు. అంతేకాకుండా తాము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించేదాకా ర‌ష్యా సాయుధ ద‌ళాలు ప్ర‌త్యేక సైనిక చ‌ర్య‌ను కొన‌సాగిస్తాం అని రష్యా దేశ ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయిగువే పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ను నిస్సైనీక‌ర‌ణ చేయ‌డంతో పాటుగా ఉక్రెయిన్ నుంచి నాజీ త‌త్వాన్ని పార‌దోల‌డ‌మే.. ర‌ష్యా ల‌క్ష్యాల‌ని సెర్గీ వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌ను నిస్సైనీక‌ర‌ణ చేసేందుకు తాము సైనిక చ‌ర్య‌కు పాల్ప‌డితే, అందుకు ప్ర‌తిగా పాశ్చాత్య దేశాలు త‌మ‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. పాశ్చాత్చ దేశాల సైనిక ముప్పు నుంచి ర‌ష్యాను కాపాడుకోవ‌డం కూడా త‌మ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మ‌ని సెర్గీ షోయిగువే తెలిపారు.