అందులో వాస్తవం లేదు: బాలకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

అందులో వాస్తవం లేదు: బాలకృష్ణ

April 26, 2022

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణకు ‘అఖండ’ సినిమా షూటింగ్‌లో చిన్న ప్రమాదం వల్ల భుజానికి ఆపరేషన్ జరగడం, కోలుకోవడం తెలిసిందే.   అయితు ఆయన ఇంకా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, మోకాలికి డాక్టర్లు మైనర్ సర్జరీ నిర్వహించారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండాబాలయ్య మోకాలికి ప్యాడ్ ధరించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే బాలకృష్ణకు సర్జరీ జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తరఫు ప్రతినిధులు తెలిపారు. ప్రతినిధులు మాట్లాడుతూ..”కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 101వ చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరిగిన షూటింగ్‌లోనూ ఆయన పాల్గొన్నారు” అని తెలిపారు.

అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి ఆయన ప్రతినిధులు చెక్ పెట్టారు.