There is only one way for Team India to reach the final
mictv telugu

టీమిండియా ఫైనల్‌కి చేరాలంటే..ఈ ఒక్క మార్గమే ఉంది

September 7, 2022

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ..ఆసియా కప్ సూపర్-4 నుంచి టీమిండియా ఫైనల్‌కి చేరాలంటే ఏదైనా మార్గం ఉందా? నెక్ట్స్ జరగబోయే మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిస్తే, ఫైనల్‌కి చేరే ఛాన్స్ ఉంటుందా? అనే అనుమానాలు క్రికెట్ ప్రియుల్లో పదే పదే రేకెత్తుతున్నాయి. ఆ అనుమానాలపై క్రికెట్ విశ్లేషకులు స్పందిస్తూ.. టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌కి చేరాలంటే ఓ మార్గం ఉందని వివరించారు.

”టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌కి చేరే అవకాశాలు కాస్త ఉన్నాయనే చెప్పాలి. కానీ, ఆచరణలో అది అంత తేలికైన విషయం కాదు. ఇవాళ అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో పాక్ గెలిస్తే, భారత్ ఇంటి ముఖం పట్టినట్లే. కానీ, ఇవాళ్టి మ్యాచ్‌లో అఫ్ఘాన్ చేతిలో పాకిస్తాన్ ఓడితే గనుక భారత్‌కు ఓ అద్భుత అవకాశం వచ్చినట్లే. అప్పుడు టీమిండియా..అఫ్ఘాన్ మీద భారీ విజయం సాధిస్తే, భారీగా నెట్‌రన్ రేటు పెరుగుతుంది. దాంతో టీమిండియా ఫైనల్ రేసులో నిలుస్తుంది. సూపర్-4లో తొలి రెండు మ్యాచుల్లో ఆడినట్లు కాకుండా నెక్ట్స్ మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా విజృంభించాలి. భారీ తేడాతో విజయం సాధిస్తేనే అప్పుడు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

అయితే, ఈ రేసులో నిలవాలంటే అప్ఘాన్ మీద భారత్ గెలవడం ఎంత ముఖ్యమో, శుక్రవారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పాక్ ఓటడం కూడా అంతే ముఖ్యము. అప్పుడే నెటరన్ రేట్ ఆధారంగా రెండో జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అలా జరగాలంటే అప్ఘాన్, శ్రీలంక జట్లపై పాకిస్థాన్ ఓడితేనే భారత్‌కు అవకాశం ఉంటుంది. ఈ రెండు మ్యాచుల్లో పాక్ ఒక్కటి గెలిచినా, అప్ఘాన్‌తోపాటు భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇవాళ అఫ్ఘాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే మాత్రం, సూపర్-4లో మిగిలిన రెండు మ్యాచ్‌లు నామమాత్రం అవుతాయి. ఒకవేళ పాక్‌పై అఫ్ఘానిస్థాన్ గెలిస్తే మాత్రం..భారత్ భవితవ్యం శ్రీలంక చేతిలో ఉంటుంది. ఏది ఏమైనా ఈరోజు జరిగే మ్యాచ్‌పైనే భారత్ భవిష్యత్ ఆధారపడుంది.”