There is public opposition to our government: Minister Dharmana
mictv telugu

మా ప్రభుత్వంపై ప్రజల్లో ఆ ఫీలింగ్ ఉంది.. ఒప్పుకున్న మంత్రి ధర్మాన

November 8, 2022

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీపై ప్రజలకున్న అభిప్రాయాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇందుకు కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు. తాము అమలు చేస్తున్న సంస్కరణలను ప్రజలు అర్ధం చేసుకోకపోవడం వల్లే వ్యతిరేకత వచ్చిందని మంగళవారం అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. సాధారణంగా సంస్కరణలు చేసే వారిపై ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉంటుందని, సంస్కరణలు చేసేటప్పుడు ఫలితాలు వెంటనే రావని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ కారణంగానే ప్రజల నుంచి ఆమోదం త్వరగా రాదని, తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా, ప్రజల మంచి కోసం సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారని మంత్రి ధర్మాన అన్నారు.