There should be same level of reservation for tribals across the country, says CM KCR
mictv telugu

దేశవ్యాప్తంగా బంజారాలకు ఒకే స్థాయి రిజర్వేషన్లు ఉండాలి.. సీఎం కేసీఆర్

September 17, 2022

There should be same level of reservation for tribals across the country, says CM KCR

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించారు. ఆదివాసీ, గిరిజన తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం.. వారి ఆత్మగౌరవ ప్రతీకలుగా బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌ 10లో కుమ్రం భీమ్‌ ఆదివాసీ, సంత్‌ సేవాలాల్‌ బంజారా భవనాలను నిర్మించింది. వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. జీ ప్లస్‌ వన్‌ విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేర్వేరుగా 1000 మంది కూర్చొనేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్‌ హాల్స్‌, వీఐపీ లాంజ్‌లు, ఫొటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్‌ వంటి ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉండే గిరిజ‌న బిడ్డ‌లంద‌రికీ స‌మాన హోదా వ‌చ్చే కార్య‌క్ర‌మానికి జాతీయ స్థాయిలో మ‌నం పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బంజారాలకు ఒకే స్థాయి రిజర్వేషన్లు ఉండాలని కోరారు. టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక ఏకీకృత వ్యవస్థ తీసుకోస్తామని చెప్పారు. ఉన్నత స్థానాల్లో ఉన్న గిరిజనులు తండాల్లో సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరించబోతున్నామని చెప్పారు. గిరిజనుల సమస్యల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. సాయంత్రం జరిగే సభలో అన్ని విషయాలను మాట్లాడతానని తెలిపారు.