There was a need to demand the resignation of Amit Shah, tweets subramanian swamy
mictv telugu

అమిత్ షాకు క్రీడల శాఖ అప్పగిస్తే బాగుండేది.. బీజేపీ నేత

June 3, 2022

There was a need to demand the resignation of Amit Shah, tweets subramanian swamy

జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోయినందుకు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆ ప్రాంతంలోని కొందరు హిందువులు.. కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి డిమాండ్‌ చేశారు. ‘జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది. అయినా, రోజుకో కశ్మీరీ హిందువు హత్యకు గురవుతున్నాడు. కచ్చితంగా అమిత్‌ షా రాజీనామాకు డిమాండ్‌ చేయాల్సిందే. ఆయనకు క్రీడా మంత్రిత్వ శాఖ ఇస్తే మంచిది. ఈ మధ్య కాలంలో క్రికెట్‌పై అవసరం లేని ఆసక్తి లభిస్తున్నది’ అని సొంత పార్టీ నేత ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు.

ఇంతకుముందు కూడా అమిత్ షాపై సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు చేశారు. టీ 20 మెగా టోర్నీ ఫలితాల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లు నిఘా సంస్థల్లో అనుమానాలున్నాయన్న ఆయన.. అమిత్ షా కుమారుడు భారత క్రికెట్‌ బోర్డుకు ‘నియంత’గా ఉన్నంతవరకూ ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.