అగ్రరాజ్యం అమెరికా భవిష్యత్తు 2023లో ఎలా ఉండబోతోందో రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతా మండలి ఉపాధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు జోస్యం చెప్పారు. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుందని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దేశాధ్యక్షుడవుతారని ట్వీట్ చేశారు. దీంతోపాటు టెక్సాస్, కాలిపోర్నియా రాష్ట్రాలు విడిపోయి ప్రత్యేక దేశాలుగా ఏర్పడతాయని సంచలన ఊహాగానాలు చేశారు. ఐర్లాండ్, మెక్సికో, యూరప్ విభజన గురించి కూడా చెప్పినా అమెరికా విషయాలు భీబత్సంగా వైరల్ అయ్యాయి. ఈ ట్వీట్ ఎలాన్ మస్క్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ‘మెద్వెదేవ్ ఓ పురాణ కథను వల్లించారు. రాజకీయంగా, తెలివితేటల పరంగా చూసినా అత్యంత అవాస్తవ, అసంబద్ధమైన అంచనా వేశారు. ఇది అతని అవగాహన లేమికి నిదర్శనం’ అని కౌంటరిచ్చారు.