లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యాలు
దేశంలో కరోనా వైరస్ ప్రభావం గురించి, లాక్ డౌన్ పరిణామాల గురించి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఈ నెల 17తో ముగుస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపు గురించి మోదీ కీలక వ్యాఖ్యాలు చేశారు. లాక్‌డౌన్ మరింతకొంత కాలం పొడగింపు ఉంటుందని వెల్లడించారు.
లాక్‌డౌన్ 4వ దశ ఉంటుందని, వివరాలు 18వ తేదీకి ముందే ప్రకటిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాగే రూ. 20లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది దేశ జీడీపీలో 10శాతం అని తెలిపారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వ్యాపారులు, రైతులు.. ఉద్యోగులు శ్రామికులను ఆదుకోవడానికే ఈ ప్యాకేజీ ప్రకటించామని తెలిపారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి సూచనలు సలహాలు తీసుకున్న సంగతి తెల్సిందే.