There will be no KGF 3 movie: Hero Yash
mictv telugu

మా సినిమాలు చూసి నవ్వుకునేవారు.. కేజీఎఫ్ హీరో యశ్

November 6, 2022

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ హీరో యశ్.. పదేళ్ల కింద దక్షిణాది చిత్రాల పరిస్థితిపై ముంబైలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పదేళ్ల క్రితం నుంచే ఉత్తరాదిలో దక్షిణాది డబ్బింగ్ సినిమాకు ప్రాధాన్యత పెరిగింది. మొదట్లో మా సినిమాలు ఇక్కడ తక్కువ ధరకు అమ్ముడుపోయేవి. డబ్బింగ్ సరిగ్గా ఉండేది కాదు. కామెడీ టైటిల్స్ పెట్టి విడుదల చేసేవారు. హీరో కొడితే రౌడీలు అంతెత్తున ఎగిరిపడడం ఏంటని నవ్వుకునేవాళ్లు. దాంతో ఇక్కడి వారు మా సినిమాలను ఎగతాళి చేసేవారు. రానురాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ఉత్తరాది వారు మా సినిమాలోని కళను అర్ధం చేసుకున్నారు.

రాజమౌళి బాహుబలి ద్వారా పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాతో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ క్రెడిట్ అంతా ఆయనదే. ఇప్పుడు సౌత్ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు. డిజిటల్ రంగంతో మా సినిమాలు ప్రపంచవ్యాప్తం అయ్యాయ’ని వ్యాఖ్యానించారు. అలాగే కేజీఎఫ్ 3 పై కూడా మాట్లాడారు. ‘ఆ ప్రాజెక్ట్ బహుశా ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి చాలా సమయం పడుతుంది. నా దృష్టి అంతా వేరే ప్రాజెక్టులపై ఉంది. త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తా’నని చెప్పారు.