ఈ 5 సూత్రాలు తప్పనిసరి: వెంక‌య్య నాయుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఈ 5 సూత్రాలు తప్పనిసరి: వెంక‌య్య నాయుడు

February 22, 2022

05

ఫిబ్రవరి 21 (సోమవారం) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళవారం భారత్ భారతి భాషా మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. “మన మూలాలు, సంస్కృతిని తెలియజెప్పి, ముందుకు నడిపించే సారథే భాష. భాష మన అస్థిత్వాన్ని చెప్పడమే కాకుండా, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే నిక్షిప్తం చేశారు. ఆ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించినవారికి మాతృభాష ఎంతో బలాన్ని అందిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా మాతృభాషను కాపాడేందుకు ఐదు సూత్రాలు అవసరమ‌ని, పరిపాలనా భాషగా మాతృభాషకు మరింత ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో ఇచ్చేందుకు చొరవ చూపాలి. సాంకేతిక రంగంలో మాతృభాష వినియోగించాలి. కుటుంబ స‌భ్యుల‌తో అంద‌రూ మాతృభాషలోనే మాట్లాడాలని ఆయన దేశ ప్రజలను కోరారు.