ఇవి డైనోసార్లా!..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇవి డైనోసార్లా!..వీడియో వైరల్

May 12, 2022

ఒకప్పుడు డైనోసార్లు ఉండేవని పెద్దలు చేప్తూంటే విన్నాము. కొన్ని హాలీవుడ్‌ సినిమాల్లో డైనోసార్లను చూశాము. కానీ, నిజమైన డైనోసార్లు ఎలా ఉంటాయో? ఎక్కడ ఉంటాయో? ఇప్పటికి అనుకోవటం తప్ప, వాటిని చూసిందేలేదు. తాజాగా ఈ డైనోసార్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..’బీచ్‌లో కొన్ని బేబీ డైనోసార్లు ఒకదాని వెనక ఒకటి వరుసగా పరిగెత్తుతూ వెళ్తున్నాయి.’ ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ ఇవి డైనోసార్లా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో అంతరించిన డైనోసార్లు మళ్లీ కనిపించడమేంటని కామెంట్స్ చేస్తున్నారు.

 

సరిగ్గా పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. అవి డైనోసార్లు కావని, డైనోసార్లను పోలి ఉన్న కోటిస్ అనే జీవులని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ”వీటిని కోటిముండిస్ అని కూడా పిలుస్తారు. ఇవి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికో, నైరుతి యునైటెడ్ స్టేట్స్‌‏లో ఎక్కువగా కనిపిస్తాయి.” ఈ వీడియోకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రోజునుంచి నేటీవరకు 13.7 మిలియన్లకు పైగా వీక్షణలు, 3 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయని ట్విటర్ అధికారులు పేర్కొన్నారు.