ఇవి ఇండియా కళ్లద్దాలే.. ధర రూ.25 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఇవి ఇండియా కళ్లద్దాలే.. ధర రూ.25 కోట్లు

September 16, 2021

These are not ordinary spectacles : cost Rs.25 crores

చూడటానికి మామూలు కళ్లద్దాల్లాగే కనిపిస్తాయి. కానీ పూర్తిగా తెలుసుకుంటే మాత్రం మన మతి పోవాల్సిందే. అవును మీరు చదువుతుంది నిజమే ,అవి అలాంటి ఇలాంటి కళ్ళద్దాలు కావు. సాధారణంగా కళ్లద్దాల అద్దాలను గాజుతో చేస్తారు. వీటిని మాత్రం వజ్రం, పచ్చతో అద్భుతమైన డిజైన్‌తో, నగిషీలతో ప్రత్యేకంగా తయారుచేశారు.అది కూడా మన గోల్కొండ వజ్రాల గనిలో అరుదుగా లభించే అపురూపమైన 200 క్యారెట్ల వజ్రం నుంచి తయారుచేశారు.

ఇవి 17 వ శతాబ్దంలో పాలించిన మొగల్ రాజవంశీకులకు చెందినవట. మొగలుల కాలం నాటి కళాకారుల పనితనానికి, నైపుణ్యానికి ఇదో మచ్చుతునకని వీటిని వేలం వేస్తున్న సథబీస్‌ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్ని అప్పటి మొఘల్‌ చక్రవర్తి లేదా ఆయన దర్బారులో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి లేదా అధికారి ధరించి ఉండొచ్చని అంటున్నారు. జ్ఞానసిద్ధికి.. దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటానికి కూడా వీటిని ధరించేవారట! వచ్చే నెలలో జరగనున్న వేలంలో ఇవి కనీసం రూ.25 కోట్లు పలుకుతాయని సథబీస్‌ సంస్థ భావిస్తోంది.