యావత్ ప్రపంచమంతా ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కోసం ఎదురుచూస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ కార్యక్రమం జరుగునుంది. మునుపెన్నడూ లేనివిధంగా భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ఈసారి ఆస్కార్ సంరంభం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అందుకు కారణం… ఆస్కార్ బరిలో మన ఆర్ఆర్ఆర్ చిత్రం ఉండడమే. నాటు నాటు పాటకు గాను ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కచ్చితంగా అవార్డు మనకే దక్కుతుందని యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీ, తెలుగు అభిమానులతోపాటు దేశమంతా ఎదురుచూస్తున్నది.
ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ లో మన దేశం నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ దట్ బ్రీత్స్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ది ఎలిఫెంట్ విస్ఫర్స్ ఆస్కార్ రేస్ లో నిలిచాయి. కాగా ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు పలు కేటగిరీలో అనేక సినిమాలు నామినేషన్స్ నిలిచి ఆస్కార్ కోసం పోటీ పడ్డాయి.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ
మదర్ ఇండియా : మొట్ట మొదటిసారిగా 1958లో భారతదేశం తరుపు నుంచి ‘మదర్ ఇండియా’ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నిలిచింది. ఒక భారతీయ తల్లి తన పిల్లలు కోసం, తన కుటుంబం కోసం పడే కష్టాలను మరియు దేశంలోని గ్రామ పరిస్థితులను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూనే గుండెకు హత్తుకునేలా చిత్రీకరించారు.
సలాం బాంబే : దాదాపు 31 ఏళ్ళ తరువాత బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం నామినేషన్స్‌లో మరో భారతీయ సినిమా చోటు దక్కించుకుంది. ‘సలాం బాంబే’ అనే సినిమా 1989 ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ముంబై మురికివాడలో నివసించే విధి పిల్లల జీవితాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
లగాన్ : ఆ తరువాత 2002లో అమీర్ ఖాన్ ‘లగాన్’ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. అసలు క్రికెట్ అంటే కూడా తెలియని భారతీయ గ్రామస్తులు పన్ను మినహాయింపు కోసం బ్రిటిషర్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడి ఎలా ఆ మ్యాచ్ గెలిచారు అనేది ఈ సినిమా కథ.
బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ కేటగిరిలో..
ఏ రూమ్ విత్ ఏ వ్యూ : 1987 లో భారతదేశానికి చెందిన ఇస్మాయిల్ మర్చంట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఏ రూమ్ విత్ ఏ వ్యూ’ అనే ఒక బ్రిటిష్ రొమాంటిక్ ఫిల్మ్ ఆస్కార్ కి బెస్ట్ పిక్చర్ నామినేషన్స్‌లో నిలిచింది.
హోవర్డ్స్ ఎండ్ : 1993 లో ఇస్మాయిల్ మర్చంట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన మరో ఇంగ్లీష్ మూవీ ‘హోవర్డ్స్ ఎండ్’ బెస్ట్ పిక్చర్ గా నామినేట్ అయ్యింది.
ది రిమైన్స్ ఆఫ్ ది డే : ఆ తరువాత సంవత్సరం 1994 లో కూడా ఇస్మాయిల్ మర్చంట్స్ ‘ది రిమైన్స్ ఆఫ్ ది డే’ సినిమాతో ఆస్కార్ బరిలో నిలిచింది.
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో..
ది క్రియేషన్ ఆఫ్ ఉమెన్: ఇస్మాయిల్ మర్చంట్స్ నిమరించిన ‘ది క్రియేషన్ ఆఫ్ ఉమెన్’ బెస్ట్ షార్ట్ సబ్జెక్ట్ (లైవ్ యాక్షన్) గా 1961 లో నామినేట్ అయ్యింది.
బీడ్ గేమ్స్: యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా 1978 లో ‘బీడ్ గేమ్స్’ నామినేట్ అయ్యింది.
లిటిల్ టెర్రరిస్ట్: 2005 లో ‘లిటిల్ టెర్రరిస్ట్’ బెస్ట్ షార్ట్ సబ్జెక్ట్ (లైవ్ యాక్షన్) గా నామినేట్ అయ్యింది.
బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో..
The House That Ananda Built : ప్రముఖ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ ఫాలీ బిలిమోరియా తెరకెక్కించిన ‘ది హౌస్ దట్ ఆనంద బిల్ట్’ 1969 లో బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)కి ఎంపికైంది.
An Encounter with Faces : 1979 లో ‘యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్’ బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)కి నామినేట్ అయ్యింది.
Writing with Fire : ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే ఫిల్మ్ 2022 లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింగా నామినేషన్స్ నిలిచింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అండ్ స్కోర్ కేటగిరిలో..
గాంధీ: గాంధీ సినిమాకు గాను 1983 లో పండిట్ రవి శంకర్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నామినేట్ అయ్యాడు.
స్లమ్‌డాగ్ మిలియనీర్: 2009 లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా నుంచి ‘ఓ సాయా’, ‘జయహో’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి నామినేట్ కాగా.. ‘జయహో’ ఆస్కార్ అవార్డుని అందుకుంది.
127 Hours : ఎ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన 127 Hours సినిమాలోని ‘ఇఫ్ ఐ రైజ్’ సాంగ్ 2011 లో ఆస్కార్ కి నామినేట్ అయ్యింది.
లైఫ్ అఫ్ పై: 2013 లో లైఫ్ అఫ్ పై సినిమాలోని ‘పైస్ లాలిపాట’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి నామినేట్ అయ్యింది.
అయితే ఈ సినిమాలన్నీ కేవలం నామినేట్ అయ్యినవే. ఇప్పటివరకు ఆస్కార్ గెలుచుకున్నది 6 భారతీయులు. భాను అతైయా (గాంధీ: బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్), సత్యజిత్ రే (అకాడమీ హానరరీ), రెసుల్ పూక్కుట్టి (స్లమ్ డాగ్ మిలినీయర్: బెస్ట్ సౌండ్ మిక్సింగ్), గుల్జార్ (స్లమ్ డాగ్ మిలినీయర్: బెస్ట్ ఒరిజినల్ సాంగ్), ఎ ఆర్ రెహమాన్ (స్లమ్ డాగ్ మిలినీయర్: బెస్ట్ ఒరిజినల్ సాంగ్), గునీత్ మోంగా (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం) ఆస్కార్ అందుకున్నారు. అయితే ఈ అవార్డులు అన్ని ఇంగ్లీష్ సినిమాలకు వర్క్ చేసి గెలుచుకున్నవి.