These are the best selling phones in India
mictv telugu

భారత్‎లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే, జాబితాను చూస్తే ఆశ్చర్యపోతారు.!

January 10, 2023

These are the best selling phones in India

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం సర్వసాధారణం. పస్తులైనా ఉంటాం కానీ..స్మార్ట్ ఫోన్ లేనిది నిమిషం ఉండలేం. అంటే మన జీవితాల్లో స్మార్ట్ ఫోన్ ఒక ప్రధానపాత్ర పోషిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ మన లైఫ్ ను హ్యాండిల్ చేసే స్థాయికి వచ్చింది. ముఖ్యంగా మార్కెట్లో ఎన్నో కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. యూజర్ల అభిరుచిని క్యాష్ చేస్తున్న కంపెనీలు..కొత్త కొత్త మోడల్స్ ను తీసుకువస్తున్నాయి. అయితే భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు ఏవో మీకు తెలుసా. మీరు కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ ఆ జాబితాలో ఉందా. భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.

ఈ జాబితాలో గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్ల గురించి పేర్కొంది. అంటే Q4,2022లో దేశంలో ఏ ఫోన్ మొదటిస్థానంలో ఉందో తెలుసుకోవచ్చు. డేటా ప్రకారం..యాపిల్ ఐఫోన్ 13ను చాలామంది ఇష్టపడ్డారని తెలిసింది. దీని మార్కెట్ వాటా శాతం 4గా ఉంది.

రెండో స్థానంలో శాంసంగ్ గెలాక్సీ ఎం13:
ఆపిల్ ఐఫోన్ 13 తర్వాత అత్యధికంగా అమ్ముడైన ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం 13. ఈ మొబైల్ మార్కెట్ వాటా 3శాతంగా ఉంది.

మూడో స్థానంలో షియోమీ:షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించింది. షియోమీ రెడ్ మీ ఏ1 మూడవ స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ వాటా కూడా 3శాతంగా ఉంది. నాలుగవ స్థానంలో శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఉంది. రియల్ మీ సి35 ఐదవ స్థానంలో ఉంది.

ఐఫోన్ 13 మార్కెట్ వాటా 4శాతం:
నివేదిక ప్రకారం ఐఫోన్ 13కూడా..మిగిలిన మార్కెట్ వాటాలో 3.3శాతంగా ఉంది. ఐఫోన్ 13 భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్ గా అవతరించడం ఇది తొలిసారి. కాగా భారత మార్కెట్ బడ్జెట్ ఫోన్లకు పేరుగాంచింది. ఇంతకుముందు ఈ జాబితా బడ్జెట్ ఫోన్లచే ఆక్రమించింది. ఇప్పుడు ఐఫోన్ దూసుకుపోయింది.

ఆన్ లైన్ , ఆఫ్ లైన్ స్టోర్ లలో ఐఫోన్ 13పై బంపర్ ఆఫర్ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది కంపెనీ. దీంతో ఆపిల్ ప్రేమికులు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.