These are the causes of fires in electric two wheelers
mictv telugu

చెప్పులు పోయాయని రైతు ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే

May 9, 2022

These are the causes of fires in electric two wheelers

సాధారణంగా మనం చెప్పులు పోతే ఏం చేస్తాం? శని పోయిందని వదిలేస్తాం. కానీ, మధ్యప్రదేశ్‌లో ఓరైతు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట తేలికగా తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆ రైతు చెప్పిన కారణం చూసి షాకయి కేసు నమోదు చేశారు.

ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఈ విచిత్ర కేసు నమోదైంది. జితేంద్ర అనే రైతు తన చెప్పులు పోయాయని, ఇందులో కుట్ర దాగి ఉందని ఫిర్యాదు చేశాడు. ‘చోరీ చేసిన నా చెప్పులను దొంగ ఒకవేళ నేరం జరిగే ప్రాంతంలో పడేస్తే నేరం నామీద పడుతుంది. నా శత్రువులు నన్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రమాదం ఉంది’ అని పోలీసులతో చెప్పాడు. అంతేకాక, అందుకు తగ్గ ఆధారాలను కూడా చూపాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి రైతు ముందుచూపును అభినందించారు.